అవినీతికి అమ్మ, నాన్న జగనే: లోకేశ్‌

nara

అవినీతి భూతాన్ని తరిమేద్దాం అంటూ టోల్‌ ఫ్రీ నం.14400ను సీఎం జగన్‌ ప్రారంభించిన వార్తపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్టాండ్‌ అప్‌ కామెడీ అదిరిపోయింది. అవినీతికి అమ్మా, నాన్న కూడా తానే అయిన జగన్‌… అవినీతిని నిర్మూలిస్తా అని స్టేట్‌మెంట్‌ ఇవ్వడంకన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా? జగన్‌ అవినీతిపై ప్రపంచంలోని ఉత్తమ సంస్థలు, విశ్వవిద్యాలయాలు అధ్యయనం చేసి… ఆయన అవినీతి కీర్తి గురించి ప్రపంచ దేశాల్లో కేస్‌ స్టడీగా చెప్తుంటే.. ఆయన, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై అధ్యయనం చేయిస్తానని అనడం ఏంటి? కామెడీ కాకపోతే!’’ అని వ్యాఖ్యానించారు. ‘‘అంతా బ్రహ్మాండంగా ప్లాన్‌ చేశారు. పబ్లిసిటీ పీక్స్‌కు వెళ్లింది. కానీ చిన్న తప్పుచేసి దొరికిపోయారు. ‘మానాన్న నిజాయితీపరుడు. మరి మీనాన్న’ అని రాసి ఉన్న ప్లకార్డును పక్కనున్న అధికారితో పట్టించిన జగన్‌.. తాను పట్టుకునే ధైర్యం చేయలేకపోయారు’’ అంటూ ట్వీట్‌ చేశారు.

Share This Post
0 0

Leave a Reply