అయోధ్య తుది తీర్పు: మసీదుకు 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం

అయోధ్య కేసులో తుది తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఏకాభిప్రాయానికి వచ్చిన ఐదుగురు జడ్జిల ధర్మాసనం.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్థలం సున్నీబోర్డుకు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1993లో ప్రభుత్వం సేకరించిన స్థలంలో అయినా సున్నీ బోర్డుకు స్థలం ఇవ్వొచ్చని పేర్కొంది ధర్మాసనం. వివాదాస్పదన భూమిని రామజన్మభూమికి న్యాస్‌కు సుప్రీంకోర్టు అప్పగించింది. ఇక, మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని అయోధ్య వివాదంలో స్పష్టమైన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. మందిర నిర్మాణానికి అయోధ్య చట్టం కింద 3 నెలల్లో ఒక ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది ధర్మాసనం.

వివాదాస్పద స్థలం మొత్తం తమ అధీనంలోనే ఉన్నట్లు సున్నీ వక్ఫ్‌ బోర్డు కూడా నిరూపించలేకపోయిందని వెల్లడించింది సుప్రీంకోర్టు. వివాదాస్పద స్థలంలోని లోపలి భాగమే వివాదాస్పదమని తెలిపింది. మసీదును ముస్లింలు ఎప్పుడూ వదిలేయలేదని స్పష్టం చేసింది ధర్మాసనం. వివాదాస్పద స్థలం లోపలి భాగాన్ని ముస్లింలు వదిలిపెట్టారనడానికి ఆధారల్లేవంది సుప్రీంకోర్టు. వివాదాస్పద స్థలం బయట భాగం నిరంతరంగా తమ అధీనంలోనే ఉందని హిందువులు నిరూపించారని తెలిపింది. న్యాయ సూత్రాల ఆధారంగానే భూ యాజమాన్యాన్ని నిర్ణయించాలని పేర్కొంది సుప్రీంకోర్టు. సకాలంలోనే సున్నీ వక్ఫ్‌ బోర్డు పిటిషన్‌ వేసిందని తేల్చింది ధర్మాసనం. విగ్రహం పెట్టడమంటే మత దూషణ కిందకే వస్తుందని తెలిపింది సుప్రీంకోర్టు. హిందువుల నమ్మకం నిజమైనది కాదని అనడానికి ఆధారల్లేవు అని సీజే తన తీర్పులో స్పష్టం చేశారు. ఈ నమ్మకానికి విలువుందో లేదో తేల్చడం కోర్టు పరిధిలోనిది కాదని సుప్రీం వెల్లడించింది. నమ్మకం, విశ్వాసాల ఆధారంగా భూ యాజమాన్య హక్కులను నిర్ణయించలేమని తేల్చి చెప్పింది ధర్మాసనం. ఆలయాన్ని ధ్వంసం చేశారనడానికి…12 నుంచి 16 శతాబ్దాల మధ్య వివాదాస్పద స్థలంలో ఏముందో చెప్పడానికి పురావస్తు ఆధారాల్లేవని తీర్పులో పేర్కొన్నారు సీజే. అయోధ్యను హిందువులు రామజన్మభూమిగా భావిస్తారని.. ఈ భావనలో ఎలాంటి వివాదానికి తావు లేదని స్పష్టంచేశారు. పురావస్తు పరిశోధనలను బట్టి చూస్తే.. 12వ శతాబ్దంలోనే ప్రార్థనా స్థలం ఉందని పేర్కొంది సుప్రీంకోర్టు. అయితే అది దేవాలయం అని చెప్పడానికి ఆధారాల్లేవని తేల్చింది. ఆ స్థలంలో బాబ్రీ మసీదుకు ముందు ఇస్లామిక్‌ నిర్మాణాలేవీ లేవంది ధర్మాసనం.

Share This Post
0 0

Leave a Reply