‘అమ్మ’ బయోపిక్..ఎన్టీఆర్‌గా టాలీవుడ్ అగ్ర హీరో..?

సౌత్, నార్త్..ఇలా అన్ని ఫిల్మ్ సర్కిల్స్‌లోనూ ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితాధారంగా ‘తలైవి’ పేరుతో బయోపిక్‌ స్టార్టయ్యింది. దర్శకుడు ఎ.ఎల్‌ విజయ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లింది. కంగనా రనౌత్‌ జయలలిత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మిగతా నటీనటుల సెలక్షన్స్‌పై మూవీ యూనిట్ దృష్టి సారించింది. అటు సినీరంగంతో పాటు, రాజకీయరంగంలోనూ కీలక వ్యక్తిగా మెలిగిన జయ జీవితచరిత్ర తీస్తున్నారంటే..లెజెండ్స్‌ని తెరపైన చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎంజీఆర్‌గా అరవింద్‌ స్వామి, కరుణానిధిగా ప్రకాష్‌ రాజ్‌‌లను ఫైనల్ చేశారు. తాాజాగా విశ్వవిఖ్యాతనటసార్వభౌమ ఎన్టీఆర్ పాత్రకు కూడా నటుడ్ని సెలక్ట్ చేసినట్టు సమాచారం.

నందమూరి బాలక‌ృష్ణ తప్పితే ఆ పాత్రలో మరొక వ్యక్తి యాప్ట్ అవ్వరని ‘తలైవి’ మూవి యూనిట్ ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది. ఆ ప్రపోజల్ బాలయ్య దగ్గరికి కూడా తీసుకెళ్లడంతో..నటించేందుకు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఎన్టీఆర్, జయలలిత చాలా చిత్రాల్లో కలిసి ఆడిపాడారు. కాగా బాలయ్య..ఆయన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌లో లీడ్ రోల్‌లో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించనప్పటికి..బాలయ్య..ఎన్టీఆర్ లుక్‌లో మెస్మరైజ్ చేశాడు.

Share This Post
0 0

Leave a Reply