అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతివ్వాలని నిర్ణయించిన మమతా బెనర్జీ

-mamata-banerjee-
-mamata-banerjee-

బీజేపీతో అనుదినం కయ్యానికి కాలు దువ్వే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ బిల్లుతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించే బిల్లును కేంద్ర హోంమంత్రి రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు మద్దతు ప్రకటించాలని మమతాబెనర్జీ పార్టీ టీఎంసీ నిర్ణయించింది. మరోవైపు, జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన పొడిగింపు బిల్లుకు తాము మద్దతు పలుకుతున్నట్టు సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ సభలో ప్రకటించారు.

ఈ రెండు బిల్లులు శుక్రవారం నాడు లోక్ సభలో ఆమోదం పొందాయి. వాయిస్ ఓటు ద్వారా ఈ బిల్లులు పాస్ అయ్యాయి. జమ్ముకశ్మీర్ లో రేపటితో రాష్ట్రపతి పాలన ముగుస్తోంది. దీంతో జూలై 3 నుంచి మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలనను పొడిగించాలంటూ అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టారు.

Tags : amithsha , bjp , mamatabenrjee , amithsha , jammukashmir , governor ,

Share This Post
0 0

Leave a Reply