అమిత్‌ షాతో భేటీ అయిన జగన్‌

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. అమిత్‌షాతో భేటీ అనంతరం మధ్యాహ్నం 12.30 సమయంలో జగన్‌, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో, మధ్యాహ్నం 3 గంటలకు ప్రహ్లాద్‌ జోషితో సమావేశం కానున్నారు. అమిత్‌షాతో సోమవారమే భేటీ కావాల్సి ఉన్నప్పటికీ హరియాణా, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం వాయిదాపడింది. ఈరోజు సాయంత్రం విశాఖకు చేరుకోనున్న సీఎం జగన్ అక్కడ ఎంపీ గొట్టేటి మధవి రిసెప్షన్ వేడుకలో పాల్గొంటారు.

Share This Post
0 0

Leave a Reply