అమరావతి రాజధాని కాదని జగన్ ఎక్కడైనా చెప్పారా?: మంత్రి కన్నబాబు

ఏపీ రాజధానిపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు రాజధానిపై నివేదికలు… మరొకవైపు మంత్రుల గందరగోళ వ్యాఖ్యలుతో అసలు ఏం జరగబోతోందో అర్థం కాక జనాలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా ఇదే అంశంపై మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, ఏపీ రాజధాని అమరావతి కాదని ముఖ్యమంత్రి జగన్ ఎక్కడైనా చెప్పారా? అంటూ గందరగోళాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లారు. హై పవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే రాజధానిపై జగన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కమిటీల నివేదికలను అసెంబ్లీలో చర్చించిన తర్వాతే జగన్ స్పష్టమైన ప్రకటన చేస్తారని తెలిపారు.

శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి చంద్రబాబు అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారని కన్నబాబు విమర్శించారు. అమరావతి రైతులు రోడ్డెక్కడానికి చంద్రబాబే కారణమని చెప్పారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు.

Share This Post
0 0

Leave a Reply