అనుష్క కలిస్తే.. ఆ విషయం చెప్తా.. లేదంటే కష్టమే : ప్రభాస్

బాలీవుడ్‌లో సాహో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ప్రభాస్‌కు.. ఎక్కడికెళ్లినా ‘పెళ్లి’కి సంబంధించిన ప్రశ్నే ఎదురవుతోంది. మరీ ముఖ్యంగా అనుష్క-ప్రభాస్‌ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఏమైనా ఉందా..? అని చాలామంది యాంకర్స్,జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.అనుష్కకు తనకు మధ్య అలాంటిదేమీ లేదని ప్రభాస్ ఇప్పటికే ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినా.. ఇలాంటి ప్రశ్నలకు మాత్రం తెరపడటం లేదు.తాజాగా ప్రభాస్‌కు మరోసారి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. దీంతో ప్రభాస్ కాస్త చిరాకు పడ్డాడు. ఇక తనకో.. అనుష్కకో పెళ్లయితే తప్ప ఈ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడదని.. ఈసారి అనుష్క కలిస్తే ఎవరినో ఒకరిని త్వరగా పెళ్లి చేసుకోమని చెప్పేస్తానని చెప్పాడు.

అనుష్క,తాను మంచి స్నేహితులం మాత్రమే అని ప్రభాస్ మరోసారి స్పష్టం చేశారు. రూమర్స్‌ను అంత సీరియస్‌గా తీసుకోవద్దని ఇద్దరం నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇదిలా ఉంటే,ప్రభాస్-శ్రద్దాకపూర్ జంటగా నటించిన సాహో చిత్రం అగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Share This Post
0 0

Leave a Reply