అద్దెబస్సుల టెండర్లు పూర్తి

ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులు నడిపేందుకు 1,035 అద్దెబస్సుల కోసం జారీచేసిన టెండర్లు ముగిశాయని ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్‌శర్మ హైకోర్టుకు వెల్లడించారు. ఆర్టీసీలోకి అద్దెబస్సులను తీసుకునే టెండర్ల ప్రక్రియను వ్యతిరేకిస్తూ టీఎస్‌ఆర్టీసీ కార్మికసంఘ్ దాఖలుచేసిన పిటిషన్‌లో సునీల్‌శర్మ శుక్రవారం కౌంటర్ దాఖలుచేశారు. అక్టోబర్ 14న టెండర్ నోటిఫికేషన్ వేశామని, అదే నెల 21తో గడువు ముగియడంతో అదేరోజు టెండర్లను ఓపెన్ చేశామని తెలిపారు. విజయవంతంగా టెండర్లు దక్కించుకున్న 287 మంది బిడ్డర్లకు అలాట్‌మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చామని పేర్కొన్నారు.

Share This Post
0 0

Leave a Reply