అంగరంగ వైభవంగా.. కన్నుల పండుగగా… కోటి దీపోత్సవం

శ్రీ భ్రామరి విజయ శంకరస్మార్ధ వేద పాఠశాల ఘనాపాఠీల వేదపఠనంతో భక్తీ కోటి దీపోత్సవం 2019 ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత ప్రాంగణంలోని మహశివ లింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు. స్వర్ణ అనంద్ బృందం భక్తీ గీతాలు అలపించారు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహ రావు భక్తులను ఉద్దేశ్యించి ప్రసంగించారు. కార్తిక మాసం దీపాలకు ప్రసిద్దం అన్నారు గరికపాటి. వాతావరణ కాలుష్యంకు వ్యతిరేఖంగా పుట్టిన పండుగ దీపావళి అన్నారు. గరికపాటి. వృత్తి ధర్మం చేస్తే యజ్ఞం చేసినట్టే అన్నారు గరికపాటి. కోటి దీపోత్సవ వేదికపై కాశీ స్పటిక లింగాలకు సహస్రకలశాభిషేకం ,కోటి మల్లెల అర్చన నిర్వహించారు. ప్రాంగణంలో భక్తులు కోటి మల్లెల అర్చనలో పాల్గోన్నారు.కాళేశ్వర శ్రీముక్తేశ్వర స్వామి కల్యాణోత్సవం నిర్వహించారు. హంస వాహనంపై కాళేశ్వరం ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించారు.

పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీ స్వామి భక్తులకు అనుగ్రహభాషణం చేసారు. కార్తీక మాసం లో కోటి దీపోత్సవం మహపర్వం అన్నారు పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీ స్వామి. కాలంను సద్వినియెగం చేసుకుంటే ముక్తి వస్తుందని…కాలంను ను దుర్వినియెగ పరిస్తే మృత్యువు అన్నారు విద్యాశంకర భారతీ స్వామి. కార్తీక మాసంలో అగ్నిని ఆరాదించడం మన ధర్మం …కర్తవ్యం అన్నారు శ్రీ విద్యాశంకర భారతీ స్వామి. దీపం పరమశివ స్వరూపం అని జీవిత మార్గంను చూపించేది జ్యోతి అని భక్తులకు అనుగ్రహ భాషణం చేసారు పుష్పగిరి పీఠాదిపతి .

దేవ భూమి అయిన హిమచల్ ప్రదేశ్ కు రావాలని తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేసారు హిమచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తత్రేయ. విశిష్ట అతిధి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తత్రేయ ,పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీ స్వామి, ఎన్టీవీ ,భక్తీ టీవి చైర్మన్ నరేంద్ర చౌదరి తదితరులు ఈ కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు.

Share This Post
0 0

Leave a Reply